రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటి నుంచి స్వల్పంగా తగ్గుతున్నాయి. కొత్తగా 1,378 మంది వైరస్ బారినపడినట్లు తెలిపిన వైద్య ఆరోగ్యశాఖ.... వైరస్‌తో పోరాడి మరో 7 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
తెలంగాణలో మరో 1,378 కరోనా కేసులు, 7 మరణాలు - తెలంగాణ తాజా కరోనా వార్తలు
08:30 September 28
తెలంగాణలో మరో 1,378 కరోనా కేసులు, 7 మరణాలు
ప్రస్తుతం 29,673 యాక్టివ్ కేసులున్నాయన్న అధికారులు... 24,054 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్ష 1,87,211కు పెరగగా... మరణాల సంఖ్య 1,107కు చేరింది.
తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 254, రంగారెడ్డి జిల్లాలో 110, కరీంనగర్ జిల్లాలో 78, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 73, సిద్దిపేట జిల్లాలో 61, వరంగల్ అర్బన్ జిల్లాలో 58, నిజామాబాద్ జిల్లాలో 55, నల్గొండ జిల్లాలో 53, సంగారెడ్డి జిల్లాలో 50, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 49, మహబూబాబాద్ జిల్లాలో 47 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి :పళ్లెంలో ఏ పోషకాలుండాలో సూచించిన ఐసీఎంఆర్..