తెలంగాణ

telangana

ETV Bharat / state

AP Corona Cases Today : ఏపీలో లక్ష దాటిన కరోనా యాక్టివ్​ కేసులు - ap corona cases today

AP Corona Cases Today: ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 46,143 నమూనాలు పరీక్షించగా.. 13,618 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి.

Ap corona cases today
Ap corona cases today

By

Published : Jan 26, 2022, 10:42 PM IST

AP Corona Cases Today: ఏపీలో కొవిడ్‌ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 46,143 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారినపడి తాజాగా తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి మృతిచెందగా, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా నుంచి నిన్న 8,687 మంది పూర్తిగా కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 1,06,318 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1791 కేసులు నమోదు కాగా, అనంతపురంలో 1650, గుంటూరు 1464, కర్నూలు 1409, ప్రకాశం 1295, నెల్లూరు 1409 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,570 మంది మృతి చెందారు.

దేశంలో కేసుల సంఖ్య ఇలా...

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,85,914 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 665 మంది మరణించారు. 2,99,073 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసులు 4 లక్షలు దాటాయి.

  • మొత్తం కేసులు:4,00,85,116
  • మొత్తం మరణాలు:4,91,127
  • యాక్టివ్ కేసులు:22,23,018
  • మొత్తం కోలుకున్నవారు:3,73,70,971

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details