ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 84,232 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 13,400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 94 మంది ప్రాణాలు కోల్పోగా.. 21,133 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. కొవిడ్‌తో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది, ప్రకాశంలో తొమ్మిది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది, అనంతపురంలో ఎనిమిది, తూర్పు గోదావరిలో ఎనిమిది, శ్రీకాకుళంలో ఎనిమిది, విశాఖపట్నంలో ఎనిమిది, కృష్ణాలో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, కర్నూల్‌లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కడప జిల్లాలో నలుగురు మృతిచెందారు.
AP Corona Cases: కొత్తగా 13,400 కేసులు, 94 మరణాలు - ap news
ఏపీలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 84,232 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 13,400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ap covid cases
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,91,72,843 కోట్లకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 16,82,247 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరిలో 15,05,620 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 10,832మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,65,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి:Eatala Rajender: నారదాసు లక్ష్మణ్ రావును అడ్డకున్న ఈటల వర్గీయులు