రాష్ట్రంలో కొత్తగా 1302 కరోనా కేసులు.. 9 మంది మృతి - తెలంగాణలో కరోనా కేసులు
09:28 September 21
రాష్ట్రంలో కొత్తగా 1302 కరోనా కేసులు.. 9 మంది మృతి
రాష్ట్రంలో కొత్తగా 1302 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. కొవిడ్‌తో కొత్తగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1042కు పెరిగింది. 2,230 మంది వైరస్ నుంచి బయటపడగా.. ఇప్పటి వరకు మొత్తం 1,41,930 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 29,636 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 22,990 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 31,095 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 266 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 82.22 శాతానికి పెరిగింది.
ఇదీ చదవండి:కొవిడ్ ఆందోళనలకు సమీక్షతోనే పరిష్కారం!