రాష్ట్రంలో మరో 129 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,96,802 మందికి మహమ్మారి సోకింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,619 మంది మరణించారు. మరో 161 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,93,540కి చేరింది.
రాష్ట్రంలో మరో 129 కొవిడ్ కేసులు, ఒకరు మృతి - Covid news
తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 129 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 23 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
తగ్గుముఖం పట్టిన కరోనా... మరో 129 కేసులు నమోదు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,643 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 637 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 23 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి:మల్కాజిగిరిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య