ఏపీలో కొత్తగా 69వేల 618 కరోనా పరీక్షలు చేయగా... 1236 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 57 వేల 395కు చేరింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1236 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో ఏపీలో 1236 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 8,57,395కి చేరింది.
ఏపీలో కొత్తగా 1236 కరోనా కేసులు... 9 మంది మృతి
గడిచిన 24 గంటల్లో 9 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 6 వేల 899కి పెరిగింది. కొత్తగా 1696 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 16 వేల 516 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.