మూసీ నదిపై రూ.350 కోట్ల వ్యయంతో 12 కొత్త వంతెనలు నిర్మించనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ వెల్లడించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ దీనికి ఆమోదం తెలిపారని.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సంయుక్తంగా వీటిని నిర్మించబోతున్నట్లు ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా తెలిపారు. కొత్తపేట ప్రాంతంలో ఓ వంతెన నిర్మిస్తే ఈవైపు నుంచి శిల్పారామం, నాగోల్ మెట్రో వెళ్లేందుకు సులభంగా ఉంటుందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దానికి బదులిచ్చిన ఆయన.. నాగోల్ వద్ద ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తయ్యాయన్నారు. వంతెనల నిర్మాణంలో చారిత్రక వైభవం ఉట్టిపడేలా చూడాలని మంత్రి ఆదేశించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
Musi river: రూ.350 కోట్లతో మూసీపై 12 కొత్త వంతెనలు - new bridges construction on musi river
మూసీ నదికి కొత్త కళ చేకూరనుంది. చారిత్రక వైభవం ఉట్టిపడేలా నదిపై వంతెనలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రూ. 350 కోట్ల వ్యయంతో 12 వంతెనలు నిర్మించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
మూసీ నదిపై కొత్త వంతెనలు