తెలంగాణ

telangana

ETV Bharat / state

రేషన్​ బియ్యం కోసం ప్రజల పాట్లు - కార్పొరేటర్

హైదరాబాద్​ చైతన్యపురి కార్పొరేటర్​ విఠల్​ రెడ్డి లబ్ధిదారులు ఒక్కొక్కరికి 12 కిలోల రేషన్​ బియ్యాన్ని పంపిణీ చేశారు. రేషన్​ బియ్యం తీసుకోవడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంత మందికి ఎక్కడ తీసుకోవాలో తెలియక అవస్థలు ఎదుర్కొంటుంటే.. మరికొందరు డీలర్ల అలక్ష్యం వల్ల ​నానాపాట్లు పడుతున్నారు.

12-kgs-ration-distribution-at-hyderabad-chaitanyapuri
రేషన్​ బియ్యం కోసం ప్రజల పాట్లు

By

Published : Apr 4, 2020, 1:41 PM IST

హైదరాబాద్ కలెక్టర్ ఆదేశానుసారం ఎమ్మార్వో గౌతమ్ కుమార్​తో కలిసి చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్​రెడ్డి పేదలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి గంటల తరబడి క్యూ లైన్​లో నిల్చుని ప్రజలు బియ్యం కోసం పడిగాపులు కాశారు. ఎమ్మార్వో సమయానికి రాకపోవడం వల్ల బియ్యం పంపిణీ ఆలస్యం అయ్యి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కొన్నిచోట్ల లబ్ధిదారులకు ఎక్కడ రేషన్ తీసుకోవాలో తెలియక.. ఒక చోటకు బదులుగా మరో చోట క్యూలైన్​లో నిలుచుని డీలర్​ ఇక్కడ ఇవ్వరూ అని చెప్పడం వల్ల మళ్లీ వారు వేరే చోటకు తరళివెళ్లారు. బయోమెట్రిక్ మెషీన్ సర్వర్లు పని చేయకపోయినా లబ్ధిదారులు ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.

రేషన్​ బియ్యం కోసం ప్రజల పాట్లు

ఇదీ చూడండి:'జమాత్​' బాస్​పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!

ABOUT THE AUTHOR

...view details