ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు సరుగుడు తోటల్లో కింగ్ కోబ్రా సంచారం రైతులను భయపెడుతోంది. సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా ఎప్పుడేం చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
king cobra : కాస్త ఆచి తూచి నడవండి... 12 అడుగుల కింగ్ కోబ్రా తిరుగుతోంది - ap news
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో సరుగుడు తోటల్లో సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. తాము ఎప్పుడూ తిరిగే దారిలోనే కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

cobra
చింతలూరుకు చెందిన బొడ్డు లోవరాజు, సూరిబాబు పొలాల్లో ఎక్కువసార్లు కనిపించిందని చెబుతున్నారు. కింగ్ కోబ్రాను పట్టుకొని అడవుల్లో వదిలిపెట్టాలని... అటవీశాఖ అధికారులను రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:Loan app: ఆన్లైన్ లోన్ కోసం యత్నం.. యువకుడి కొంపముంచింది..!