రాష్ట్రంలో రైతు బంధు(Rythu Bandhu) సాయం కొనసాగుతోంది. రైతుబంధు సాయం కింద రెండో రోజు 1,152 కోట్లా 46 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. తొలిరోజు ఎకరంలోపు భూమి ఉన్న వారికి ఆర్థికసాయం అందించగా... రెండో రోజైన ఇవాళ ఒకటి నుంచి రెండెకరాల మధ్య భూమి ఉన్న రైతులకు సాయం అందింది.
Rythu Bandhu: రెండో రోజు రూ.1152 కోట్లు జమ - రైతు బంధు తాజా వార్తలు
రైతు బంధు(Rythu Bandhu) సాయం కింద రెండో రోజు 1,152 కోట్లా 46 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. రైతు బంధుతో గత రెండు రోజుల్లో 32,02,161 మంది రైతులకు లబ్ధి చేకూరింది.
రైతు బంధు, రైతలు
15,06,560 మంది రైతుల ఖాతాల్లో ఇవాళ రైతుబంధు పథకానికి సంబంధించిన నగదు జమ అయింది. నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లో 1,669 కోట్లా 43 లక్షల రూపాయల సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. రెండు రోజుల్లో 32,02,161 మంది రైతులకు లబ్ధి చేకూరింది. గత యాసంగిలో 59,25,725 మంది రైతుల ఖాతాల్లో రూ.7,400 కోట్లను వ్యవసాయశాఖ జమ చేసింది.
ఇదీ చదవండి:KTR: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం