రాష్ట్రంలో కొత్తగా 1,102 కరోనా కేసులు నమోదు
08:33 August 16
రాష్ట్రంలో కొత్తగా 1,102 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం (15వ తేదీన) కొత్తగా మరో 1,102 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 91,361కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. శనివారం ఒక్కరోజే కరోనాతో మరో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 693కి చేరింది. తాజాగా 1,930 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 68,126కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 234 కేసులు నమోదు కాగా.. కరీంనగర్‌లో 101, రంగారెడ్డిలో 81, మేడ్చల్‌లో 63, సంగారెడ్డిలో 66, ఆదిలాబాద్‌లో 14, భద్రాద్రి కొత్తగూడెంలో 15, జగిత్యాలలో 11, జనగామలో 16, గద్వాలలో 17, కామారెడ్డిలో 33, కరీంనగర్‌లో 101, ఖమ్మంలో 46, ఆసిఫాబాద్‌లో 3, మహబూబ్‌నగర్‌లో 37, మహబూబాబాద్‌లో 21, మంచిర్యాలలో 9, మెదక్‌లో 18, మేడ్చల్‌లో 63, ములుగులో 8, నాగర్‌కర్నూల్‌లో 29, నల్గొండలో 28, నారాయణపేటలో 4, నిర్మల్‌లో 4, నిజామాబాద్‌లో 33, పెద్దపల్లిలో 22, సిరిసిల్లలో 13, రంగారెడ్డిలో 81, సంగారెడ్డిలో 66, సిద్దిపేటలో 30, సూర్యాపేటలో 13, వికారాబాద్‌లో 8, వనపర్తిలో 19, వరంగల్ గ్రామీణ జిల్లాలో 25, వరంగల్ అర్బన్ జిల్లాలో 70, యాదాద్రి భువనగిరిలో 11 కేసులు నమోదయ్యాయి.