శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. గరుడసేవ నాడు అలంకరించే గొడుగులు చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు చేరుకున్నాయి. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో హిందూ ధర్మార్థ సమితి.. 11 గొడుగులను తితిదేకు అందిస్తుంది. ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో గొడుగులతో తిరుమలకు చేరుకున్న వారికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఆలయం ముందు గొడుగులను అధికారులకు అందించారు.
చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు 11 గొడుగులు
చెన్నై నుంచి ఊరేగింపుగా 11 గొడుగులు తిరుమల చేరుకున్నాయి. బుధవారం రాత్రి జరిగే గరుడ వాహన సేవలో గొడుగులతో అలంకరణ చేయనున్నారు. గొడుగులతో తిరుమలకు చేరుకున్న వారికి తితిదే ఛైర్మన్ స్వాగతం పలికారు.
గరుడవాహన సేవ రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బుధవారం సాయంత్రం తిరుమల చేరుకోనున్న సీఎం... రాత్రికి అక్కడే బసచేస్తారు. గురువారం ఉదయం తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో చేపట్టిన వసతిగృహాల నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి జగన్ శంకుస్థాపన చేస్తారు. నాదనీరాజనం వేదికగా జరుగుతున్న సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు.
ఇదీ చదవండి:శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు