ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - 10మే 2021 రాశిఫలాలు
ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
రాశిఫలాలు
By
Published : May 10, 2021, 4:47 AM IST
|
Updated : May 10, 2021, 5:20 AM IST
శుభఫలితాలున్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది.
చేపట్టే పనుల్లో శ్రద్ధ బాగా అవసరం. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు అవసరమవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం శుభప్రదం.
శ్రమఫలిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. మాతృసౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
తలపెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం
శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
మనస్సౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్య వినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది
మనోబలాన్ని కోల్పోరాదు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం శుభప్రదం.
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
మీ అభివ్రుద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధికై చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.