Airtel marathon: భాగ్యనగరంలో ఏటా నిర్వహించే ఎయిర్టెల్ మారథాన్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. ఎయిర్ టెల్ హైదరాబాద్ మారథాన్ పదో ఎడిషన్‌లో 6వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు మారథాన్ కొనసాగనుంది. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రెండు విభాగాల్లో మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Airtel marathon: ఆరోగ్యంపై అవగాహన కోసం ఎయిర్టెల్ మారథాన్
Airtel marathon: జంటనగరాల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఎయిర్టెల్ సంస్థ హైదరాబాద్‌లో పరుగు కార్యకమాన్ని నిర్వహించింది. ముంబయి మారథాన్ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద మారథాన్‌గా పేరొందిన ఈ పరుగును.. నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు.
భారతదేశంలో ఎయిర్ టెల్ మారథాన్‌కు ఎంతో పేరు ఉందని.. గత సంవత్సరం కరోనా వల్ల ఈ పరుగు నిర్వహించకపోయిన్నప్పటికీ ఈ సంవత్సరం మాత్రం పెద్ద సంఖ్యలో రన్నర్లు పాల్గొన్నారని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండటానికి తప్పనిసరిగా వ్యాయామం చేయాలని కోరారు. వ్యాయామం వల్ల శారీరకంగానే కాక మానసికంగానూ బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
ఇదీ చదవండి:Elon Musk School: వరంగల్ విద్యార్థి అరుదైన ఘనత.. ఎలాన్ మస్క్ పాఠశాలకు ఎంపిక