రుణ యాప్‌ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన రూ.106 కోట్లను జప్తు చేసింది. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా పీసీఎఫ్ఎస్ రుణాలిచ్చినట్లు గుర్తించిన ఈడీ.. చైనాకు చెందిన జో యాహుయ్ అధీనంలో ఈ కంపెనీ పని చేస్తున్నట్లు వెల్లడించింది.
బోగస్ సాఫ్ట్వేర్ ఎగుమతుల పేరిట పీసీఎఫ్ఎస్ విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌కు నిధులు తరలించినట్లు తెలిపింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్కు చెందిన రూ.106 కోట్ల సొమ్మును జప్తు చేసింది.