రాష్ట్రంపై కరోనా పంజా.. ఒక్కరోజే పదివేలకు పైగా కేసులు - తెలంగాణలో కరోనా కొత్త కేసులు
09:11 April 27
రికార్డు స్థాయిలో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా మహోగ్రరూపం దాల్చింది. ఒక్కరోజే అత్యధికంగా 10,122 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఏకంగా 52 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. కరోనా మొదలైన నాటి నుంచి తెలంగాణలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. జిల్లాల్లోనూ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం 69,221 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ నుంచి కోలుకుని మరో 6,446 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో గడిచిన24 గంటల్లో 99,638 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి:పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!