తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుబంధు'... ఖరీఫ్​కు రూ.500 కోట్లు విడుదల - Funds released for Raithubandu scheme in Telangana

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి ఖరీఫ్ సీజన్​కు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా రూ.500కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. తర్వలో మరో రూ.500కోట్లను జమచేయనుంది.

'రైతుబంధు' పథకం నిధులు విడుదల

By

Published : Oct 15, 2019, 4:28 AM IST

Updated : Oct 15, 2019, 7:23 AM IST

రైతుబంధు పథకం కింద సోమవారం రాష్ట్రప్రభుత్వం రైతుల ఖాతాలకు రూ.500 కోట్లు జమచేసింది. తర్వలో మరో రూ.500 కోట్లు జమచేయనుంది. గత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ముగిసిన ఖరీఫ్ సీజన్​కు ఈ పథకం కింద రూ. 1700 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం 61.13 లక్షల భూమి ఖాతాలున్నాయి. వీటిలో 58లక్షల మంది రైతులకు కొత్త పట్టదారు పాసుపుస్తకాలు ఇప్పటికే ఇచ్చినట్లు రెవెన్యూశాఖ చెబుతోంది. కానీ గత ఖరీఫ్ సీజన్ ముందు నాటికి 54.30లక్షల పాసుపుస్తకాలే ఇచ్చారు. అందువల్ల వారి వివరాలనే రైతుబంధు పథకానికి వ్యవసాయశాఖ ఆన్​లైన్​లో నమోదు చేసింది. వీరి ఖాతాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున మొత్తం రూ.4800 కోట్లను జమ చేసింది. ఇలా సొమ్ము పడిన వారిలో అత్యధిక శాతం మంది 10 ఎకరాల్లోపు భూమి కలిగిన వారే ఉన్నారు.

Last Updated : Oct 15, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details