రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బంద్ ప్రకటించగా సికింద్రాబాద్ రాణిగంజ్ బస్ డిపో ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు పహారాలో ఉన్న 49 నెం. మెహిదీపట్నం బస్సును బయటకు తీసుకువచ్చారు. దానిని కార్మికులు ఒక్కసారిగా అడ్డుకుని రాణిగంజ్ మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన వందమందిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
రాణిగంజ్‌లో వంది మంది కార్మికుల అరెస్ట్ - tsrtc employees strike 15th day latest
సికింద్రాబాద్ రాణిగంజ్ బస్ డిపో వద్ద పోలీసు పహారాలో ఉన్న బస్ బయటకు రావటంతో దాన్ని అడ్డుకున్న వంద మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాణిగంజ్ వద్ద వంది మంది కార్మికులు అరెస్ట్