నీట్ పరీక్షలో అర్హత సాధించిన ఓసీ విద్యార్థులకు ఆడ్మిషన్లలో అన్యాయం జరుగకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి న్యాయం చేయాలని ఓపెన్ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్స్ సెక్షన్ జాయింట్ ఫోరం కోరింది. మెడికల్ విద్యార్థులు, తల్లిదండ్రులతో హైదరాబాద్ హైదర్‌గూడలో సమావేశం నిర్వహించింది. జీవో నంబర్ 550 ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల ఓసీ మెరిట్ అభ్యర్థులు 440 మంది విద్యార్థులు సీట్లు కోల్పోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని తెలిపారు. కేంద్రం కేటాయించిన 10శాతం డబ్ల్యూఏఎస్ను అమలు చేసి అగ్రకులంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించి వారికి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
'ఓసీ మెరిట్ విద్యార్థులకు 10శాతం సీట్లు ఇవ్వాలి' - అడ్మిషన్ ప్రక్రియ
వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో మెరిట్ సాధించిన ఓసీ విద్యార్థులకు ప్రభుత్వమే చొరవ తీసుకుని తగిన న్యాయం చేయాలని ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర కులాల ఫోరం కోరింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఫోరం అధ్యక్షుడు పశుపతి ప్రవేశానికి సంబంధించి 10 శాతం సీట్లు తమకే కేటాయించాలన్నారు.
ప్రభుత్వమే తమ విద్యార్థులకు న్యాయం చేయాలి : పశుపతి