హైదరాబాద్లోని అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ వైద్యులు.. 25 ఏళ్ల బంగ్లాదేశ్ జాతీయుడికి తొడ ఎముకలో ఏర్పడిన 10 కిలోల బరువున్న క్యాన్సర్ కణతిని తొలగించారు. బోన్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మొదటగా క్యాన్సర్ కణతిని తొలగించి ఆ స్థానంలో లోహపు రాడ్ అమర్చారు.
బంగ్లాదేశ్ జాతీయుడికి వైద్యం..10 కిలోల క్యాన్సర్ కణతి తొలగింపు - విదేశీలకు వైద్యం తాజా వార్త
హైదరాబాద్లోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ వైద్యులు బంగ్లాదేశ్ జాతీయుడి తొడ ఎముకలో నుంచి 10 కిలోల బరువున్న క్యాన్సర్ కణతిని తొలగించి రోగిని పూర్తి స్థాయిలో కోలుకునేలా చేశారు.
![బంగ్లాదేశ్ జాతీయుడికి వైద్యం..10 కిలోల క్యాన్సర్ కణతి తొలగింపు 10-kg-of-cancerous-tumor-removal-for-bangladeshi-national-person-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5633571-551-5633571-1578455427376.jpg)
బంగ్లాదేశ్ జాతీయుడికి వైద్యం..10 కిలోల క్యాన్సర్ కణతి తొలగింపు
ఇప్పుడు రోగి పూర్తి స్థాయిలో ఎవరి సాయం లేకుండానే నడుస్తున్నాడు. తాము ఎముక కణితికి సంబంధించి పూర్తి స్థాయిలో క్యాన్సర్ చికిత్సను చేయనున్నట్లు ఆస్పత్రి ప్రకటించింది. సొంతదేశంలో కాలును తొలగించాలని వైద్యులు చెప్పారని.. ఇక్కడ డాక్టర్లు అందించిన చికిత్స వల్ల తన కుమారుడు సాధారణంగానే నడిచే వీలుండటం వల్ల రోగి తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు.
బంగ్లాదేశ్ జాతీయుడికి వైద్యం..10 కిలోల క్యాన్సర్ కణతి తొలగింపు
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ