కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గరిశపూడి సమీపంలోని 216 జాతీయ రహదారిపై... కొండచిలువను స్థానికులు గుర్తించారు. వాహనాల శబ్ధానికి అటూ, ఇటూ తిరుగుతున్న... కొండచిలువను చూసి స్థానికులు భయపడిపోయారు. చివరకు దాని తలపై నుంచి ఆటో వెళ్లడంతో గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు దాన్ని చంపివేశారు. ఆ ప్రాంతంలో అనేక విషసర్పాలు తిరుగుతుంటాయని... కొండచిలువను చూడటం ఇదే మొదటిసారని స్థానికులు చెప్పారు. కొండచిలువ వల్ల ప్రమాదం పొంచి ఉంటుందన్న భయంతో చంపేసినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదకు ఉప్పుటేరు ద్వారా ఇక్కడికి రావొచ్చని భావిస్తున్నారు.
అమ్మో.. కొండ చిలువ.. భయంతో పరుగులు..
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గరిశపూడిలో కొండచిలువ హల్చల్ చేసింది. ఆ ప్రాంతంలో అనేక సర్పాలు తిరుగుతాయని... కొండ చిలువను చూడటం ఇదే మొదటిసారని స్థానికులు చెప్పారు.
భయంతో పరుగులు..