ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం గుత్తులవారిపేటకు చెందిన గ్రామపెద్దలు.. పది కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వర్గానికి ఓటేయలేదంటూ ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చెప్పిన వారికి ఓటు వేయలేదని 10 కుటుంబాల బహిష్కరణ - తెలంగాణ వార్తలు
తూర్పుగోదావరి జిల్లా గుత్తులవారిపేటలో సాంఘిక బహిష్కరణ వెలుగులోకి వచ్చింది. పది కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వారికి ఓటు వేయలేదని బహిష్కరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

చెప్పిన వారికి ఓటు వేయలేదని 10 కుటుంబాల బహిష్కరణ
బహిష్కరణపై గొల్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పైగా.. తమపైనే కేసులు పెడతామంటూ గొల్లపాలెం ఎస్సై బెదిరించారని వాపోయారు.
ఇదీ చదవండి:రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్