తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక నుంచి పదో తరగతి పరీక్షలు ఆరు పేపర్లతోనే.. - SCERT proposals approved by Education Department

10Class Exams Conducted with Six papers: పదో తరగతి వార్షిక పరీక్షలు ఇక నుంచి ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరు పరీక్షలు జరపాలని నిర్ణయించినట్లు డీఈఓలకు ఇతర అధికారులకు శ్రీదేవసేన సర్క్యులర్ జారీ చేసింది.

ఇక నుంచి పదో తరగతి పరీక్షలు ఆరు పేపర్లతోనే..
ఇక నుంచి పదో తరగతి పరీక్షలు ఆరు పేపర్లతోనే..

By

Published : Nov 2, 2022, 7:40 PM IST

10Class Exams Conducted with Six papers: తొమ్మిది, పదో తరగతికి ఎస్ఏటూ పరీక్షలు కూడా ఆరు పేపర్లతోనే జరపాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పదో తరగతిలో పదకొండు పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. ద్వితీయ భాష మినహా ప్రథమ, తృతీయ భాష, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలు రెండు పేపర్లకు విద్యార్థులు రాస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి బోధన జరగక గతేడాది ఆరు పేపర్లతోనే పరీక్ష జరిగింది.

పదకొండు పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని.. ఆరు పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి.. ఎస్​సీఈఆర్టీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించింది. అయితే సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details