తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 1.42 లక్షలకు కరోనా బాధితులు

రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1802 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,42,771కు పెరిగింది. వీరిలో ఎటువంటి లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వారు 98,512(69శాతం) మంది ఉండగా, లక్షణాలతో కొవిడ్‌ సోకినట్లుగా తేలినవారు 44,259 (31శాతం) మంది ఉన్నారు. ఈ నెల 6న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసింది.

1.42 lakh corona victims in Telangana
1.42 lakh corona victims in Telangana

By

Published : Sep 8, 2020, 9:04 AM IST

తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్‌) పరిధిలో 245 కేసులు నిర్ధారణ అవగా, కొత్తగా 20 మందికి పైగా పాజిటివ్‌లు నిర్ధారణ అయిన జిల్లాల్లో రంగారెడ్డి(158), కరీంనగర్‌(136), సిద్దిపేట(106), సంగారెడ్డి(103), నిజామాబాద్‌(94), వరంగల్‌ నగర(93), నల్గొండ(79), జగిత్యాల(73), మేడ్చల్‌ మల్కాజిగిరి(65), ఖమ్మం(64), మహబూబాబాద్‌(63), సూర్యాపేట(62), భద్రాద్రి కొత్తగూడెం(49), కామారెడ్డి(46), మంచిర్యాల(44), మహబూబ్‌నగర్‌(40), పెద్దపల్లి(32), జనగామ(30), నాగర్‌కర్నూల్‌(29), యాదాద్రి భువనగిరి(29), వనపర్తి(25), వరంగల్‌ గ్రామీణ(21), రాజన్న సిరిసిల్ల(20) జిల్లాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 31,635 మంది కొవిడ్‌కు చికిత్స పొందుతున్నారు.

77.2 శాతం మంది కోలుకున్నారు

  • రాష్ట్రంలో ఆదివారం మరో 2,711 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకోగా, మొత్తంగా ఇప్పటి వరకూ చికిత్సానంతరం ఆరోగ్యవంతులుగా మారిన వారి సంఖ్య 1,10,214కి చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ల్లో కోలుకున్నవారు 77.20 శాతం మంది కాగా, ఈ విషయంలో జాతీయ సగటు 77.25 శాతంగా నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
  • తాజాగా కొవిడ్‌ కోరల్లో చిక్కుకొని మరో 9 మంది మృతిచెందగా, మొత్తంగా కరోనా మరణాల సంఖయ 895కు పెరిగింది.
  • ఆదివారం 36,593 నమూనాలను పరీక్షించగా, వీటిలో ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు 16,467(45శాతం) మంది, సెకండరీ కాంటాక్టు వ్యక్తులు 5,123(14శాతం) మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 17,66,982కు పెరిగింది.

ఏపీలో 8,368 మందికి పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. సోమవారం ఉదయం 9గంటల వరకు మొత్తం 5,06,493 కరోనా కేసులు నమోదవగా 4,04,074 మందికి వ్యాధి నయమైంది. 97,932 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకు మరో 8,368 పాజిటివ్‌ వచ్చాయి. కొవిడ్‌తో మరో 70 మంది మరణించారు.

కొవిడ్‌తో పాల్వంచ ఎస్సై మృతి

పాల్వంచ పట్టణ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై కొవిడ్‌తో మృతి చెందారు. మూడు నెలల క్రితమే ఆయన కొత్తగూడెం నుంచి పాల్వంచకు బదిలీపై వచ్చారు. పట్టణంలో చోటుచేసుకున్న పలు చోరీలు, గంజాయి తరలింపు తదితర కేసులను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించారు. విధి నిర్వహణలో కరోనా బారినపడటంతో హోంక్వారంటైన్‌లో ఉండి చికిత్స చేయించుకుంటూ సోమవారం మరణించారు. పాల్వంచ డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు, సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రవీణ్‌, సిబ్బంది నివాళి అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details