ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10గంటల 45 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 11గంటల 10 నిమిషాలకు గుంటూరు పయనమవుతారు. 11.20 నిమిషాలకు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభం కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శిస్తారు.విశాఖలోని చమురు నిల్వల కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు.
ఏపీలో అడుగుపెట్టనున్న మోదీ - చమురు నిల్వలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో చమురు నిల్వలకు సంబంధించి కీలక ప్రాజెక్టును ప్రారంభించి మరో రెండింటికి శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని పర్యటనపై రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వాస్తవాలు చెప్పేందుకే మోడీ వస్తున్నారంటూ భాజపా నేతలు చెబుతుండగా... ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మోదీ పర్యటన సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతల అదనపు డీజీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తు కోసం 1700 మంది పోలీసులను నియమించారు.
మోదీ ప్రారంభించే ప్రాజెక్టులు-
- అమలాపురం వద్ద ఓ.ఎన్.జీ.సి ఏర్పాటు చేసిన వశిష్ట ఎస్.1 ఆన్ షోర్ ప్రాజెక్టు
- కృష్ణపట్నం పోర్టు వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేసే చమురు నిల్వ కేంద్రానికి శంకుస్థాపన