తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ పునరావృతమైతే చర్యలు - KCR

సర్పంచ్​ను​ నేలపై కూర్చోబెట్టిన ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేలపై కూర్చున్న సర్పంచి

By

Published : Feb 7, 2019, 6:23 AM IST

నేలపై కూర్చున్న సర్పంచి
గ్రామ సర్పంచిని నేలపై కూర్చొబెట్టి పంచాయతీ నిర్వహించిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై ఏకంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ అలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం పెదిరెపహాడ్ పంచాయతీ సర్పంచిగా బాలప్ప ఎన్నికయ్యారు. ఓ పంచాయతీ తీర్పు సందర్భంగా గ్రామపెద్దలు కుర్చీల్లో కూర్చొని.. సర్పంచిని కింద కూర్చొబెట్టిన ఘటన పత్రికల్లో ప్రచురితమైంది తెలిసిందే. ఆగ్రహించిన ప్రజాసంఘాలు అవమానపరిచిన గ్రామపెద్దలపై కేసు నమోదు చేయాలంటూ మద్దూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలతో సాంఘీక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యాదయ్య గ్రామంలో విచారణ చేపట్టారు. సర్పంచి, మాజీ సర్పంచి, ప్రజలను అడిగి జరిగిన విషయంపై ఆరా తీశారు. సర్పంచి బాలప్పకు గౌరవం ఇవ్వాలని, కులం పేరిట వివక్ష చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కులవివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి కలెక్టర్​కు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details