తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2019, 9:07 PM IST

ETV Bharat / state

లోక్​పాల్​ నియామకంలో ముందడుగు

లోక్​పాల్​ నియామకం వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఛైర్మన్​, సభ్యుల ఎంపిక కోసం జస్టిస్​ రంజనా ప్రకాశ్ దేశాయ్​ నేతృత్వంలోని శోధన కమిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

లోక్​పాల్​ నియామకం వేగవంతం

లోక్​పాల్​ నియామకంపై కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. లోక్​పాల్​ ఛైర్మన్​, సభ్యుల నియామకం త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించింది.

లోక్​పాల్​ ఛైర్మన్​, సభ్యుల ఎంపిక కోసం జస్టిస్​ రంజనాప్రకాశ్​ దేశాయ్​ నేతృత్వంలో శోధన కమిటీని నియమించింది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ నెల 22వరకు దరఖాస్తులు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెలఖారులోగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేయనుంది.

లోక్​పాల్ కమిటీ నియామకం కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తన స్వగ్రామం మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో జనవరి 30 నుంచి ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు.

ABOUT THE AUTHOR

...view details