నిజాయతీకి మారుపేరు రాహుల్: మల్లు రవి
నిజాయతీకి మారుపేరు రాహుల్ గాంధీ అని అన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. ఫలితాల తర్వాతే ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిర్ణయిస్తామని రాహుల్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు.
మల్లు రవి
యూపీఏ పార్టీలే కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలు రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తాయని కాంగ్రెస్ నేత మల్లు రవి హైదరాబాద్లో ఆశాభావం వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాతే ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిర్ణయిస్తామని రాహుల్ చెప్పడం ఆయన నిజాయతీకి నిదర్శనం అన్నారు. కేసీఆర్ గొడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గులాబీ పార్టీ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీల మద్దతు కాంగ్రెస్ తీసుకుంటుందని మల్లు రవి తెలిపారు.
Last Updated : May 18, 2019, 4:41 PM IST