తెలంగాణ

telangana

ETV Bharat / state

మానవ హక్కుల కమిషన్​లో వైద్యురాలి ఫిర్యాదు

వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంటికి రాకుండా తప్పించుకు తిరుగుతున్న తన భర్తను అప్పజెప్పాలని ఓ మహిళ వైద్యురాలు మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించింది. గతంలో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించింది.

మానవ హక్కుల కమిషన్​లో వైద్యురాలి ఫిర్యాదు

By

Published : Jun 23, 2019, 12:10 AM IST

తన భర్తను తనకు అప్పజెప్పాలని ఓ వైద్యురాలు మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించింది. నిర్మల్​లో డిప్యూటీ డీఎంహెచ్​వోగా విధులు నిర్వహిస్తున్న మోహన్​బాబుకు, తనకు 19 ఏళ్ల క్రితం పైళ్లైందని బాధితురాలు డాక్టర్ సలాంధ్ర రేణుక వివరించింది. మొదట్లో తమ వైవాహిక జీవితం సాపీగా సాగిందని, కొన్నాళ్ల తర్వాత వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కన్నీరు పెట్టుకుంది.

మానవ హక్కుల కమిషన్​లో వైద్యురాలి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details