తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేదపండితులు ఇచ్చే తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఉదయం 11.45 గంటలకు ధర్మగిరి వేదపాఠశాల సందర్శించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కుటుంబ సమేతంగా వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భోజనం చేస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం ఎదుట 'నాదనీరాజనం' కార్యక్రమానికి హాజరుకానున్నారు. రాత్రి తిరుపతిలో బసచేసి... రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు.
తిరుమలేశుని సేవలో ఉపరాష్ట్రపతి వెంకయ్య - ttd
తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీసమేతంగా దర్శంచుకున్నారు. మధ్యాహ్నం వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భోజనం చేయనున్నారు. సాయంత్రం 'నాదనీరాజనం' కార్యక్రమానికి హాజరువుతారు.
![తిరుమలేశుని సేవలో ఉపరాష్ట్రపతి వెంకయ్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3466752-1072-3466752-1559630869290.jpg)
ఆకలి... అవినీతి... లేని సమాజం కావాలి
తిరుమలను సందర్శించిన అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఆకలి... అవినీతి... లేని సమాజం నిర్మాణం కావాలి. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతందని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని... ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రముఖులు దర్శనానికి రావాలి తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు. ఇక రాజకీయాల గురించి ప్రాస్తావిస్తూ తను రాజకీయాల్లో లేనని... భవిష్యత్తులోనూ ఆ ఆలోచన లేదన్నారు. అసమానతలు ఘర్షణలు లేని సమాజం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశానికి సేవ చేసుకునే శక్తిని తనకు ఇవ్వమని శ్రీవారి సన్నిధిలో మూడు రోజులు ఉన్నానని స్పష్టం చేశారు. దైవ దర్శనం... సాహిత్యం... సత్సంగంతో ఆ శక్తి వస్తుందని విశ్వసిస్తున్నాట్లు పేర్కొన్నారు. అన్నదానం కార్యక్రమం... నాద నీరాజనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.
ఇవీ చూడండి: మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్