తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45

పీఎస్‌ఎల్‌వీ-సీ45 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. 4 స్ట్రాపాన్ బూస్టర్లతో శాస్త్రవేత్తలు తొలిసారి ఈ ప్రయోగం నిర్వహించారు. డీఆర్‌డీవోకు చెందిన ఇమిశాట్‌తో పాటు మరో 28 విదేశీ ఉపగ్రహాలను 3వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.

విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45

By

Published : Apr 1, 2019, 12:39 PM IST

విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లా షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ45 ఈరోజు ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌కు శాస్త్రవేత్తలు ప్రీ కౌంట్‌డౌన్‌, ప్రయోగ రిహార్సల్స్‌ చేశారు. షార్‌ డైరెక్టర్‌ పాండియన్‌ అధ్యక్షతన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై రాకెట్‌ ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రాకెట్‌ ద్వారా డీఆర్‌డీవో రూపొందించిన 436 కేజీల ఈఎంఐ శాటిలైట్‌ను నింగిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టారు.ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది.

అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టారు. తర్వాత దశల్లో'పీఎస్-4'ను మూడోకక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.ఈ దశలో ఇస్రో రూపొందించిన ఆటోమేటిక్‌ ఐడింటికేషన్‌ సిస్టమ్‌.... ఓడల కదలికలపై సమాచారం ఇవ్వనుంది.రేడియో అమెచ్యూర్‌ శాటిలైట్‌ కార్పొరేషన్‌ రూపొందించిన ఆటోమేటిక్‌ పాకెట్‌ రిపేరింగ్‌ సిస్టమ్‌..... రేడియో తరంగాల సమాచారాన్ని తెలపనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details