మోదీది నిరంకుశత్వమని.. రాహుల్‌ది ప్రజాస్వామ్యమని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. శంషాబాద్ కాంగ్రెస్ కనీస వాగ్దాన సభలో ప్రసంగించారు. మోదీని తీవ్రవాదిగా అభివర్ణిస్తూ... ఎప్పుడు ఏ బాంబు వేస్తారో అని ప్రజలు భయపడుతున్నారన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం ప్రధానికి ఉండాల్సిన లక్షణం కాదని హితవు పలికారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే, భాజపాకు వేసినట్లేనని తెలిపారు.
మోదీ నిరంకుశత్వమా.. రాహుల్ ప్రజాస్వామ్యమా? - vijaya shanthi fires on modi
అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలుపునకు ప్రధాని సాయం చేశారని, అందుకే కేసీఆర్‌కు మోదీ అంటే ప్రేమ అని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి దిల్లీలో మోదీతో కలిసి కేసీఆర్ చక్రం తిప్పాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ కనీస వాగ్దాన సభలో విజయశాంతి