టీఆర్టీ నియామకాలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ.. అభ్యర్థులు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. తెలంగాణలో నియామకాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే... రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 వేల 792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి... దాదాపు రెండేళ్లు ముగుస్తున్నా ఇంతవరకు నియామకాలపైన ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం వల్ల తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. పాఠశాల పునః ప్రారంభం నాటికి నియామకాలు పూర్తి చేయాలని నర్సిరెడ్డి కోరారు.
టీఆర్టీ నియామకాలు వేగవంతం చేయాలి - trt-candidates-dharana
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నియామకాలు వేగవంతం చేయాలని టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవతున్నారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు.
టీఆర్టీ నియామకాలు వేగవంతం చేయాలి
ఇవీ చూడండి: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్...
Last Updated : Jun 4, 2019, 7:34 AM IST