పాఠశాలల ప్రారంభం లోపే నియామకాలు పూర్తి చేయాలని 300 మంది టీఆర్టీ అభ్యర్థులు షాహీనాద్ గంజ్ పోలీసు స్టేషన్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రగతి భవన్కు ఉదయం వెళ్లగా... పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తున్నందున మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం వెల్లడించే వరకు దీక్ష విరమించేది లేదని తెలిపారు.
పోలీసు స్టేషన్లో టీఆర్టీ అభ్యర్థుల ఆమరణ దీక్ష - trt candidates
నియామకాలు చేపట్టాలని టీఆర్టీ అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
టీఆర్టీ అభ్యర్థుల ఆమరణ దీక్ష