పక్కా ప్రణాళికతో...
9 సభల్లో కేసీఆర్... రోడ్ షోలతో కేటీఆర్ - 2019 elections
లక్ష్యసాధన కోసం గులాబీ శ్రేణులు ప్రచార వేగం పెంచాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండగా... అధినేత సుడిగాలి పర్యటనల్లో మునిగిపోయారు. రహదారి ప్రదర్శనల్లో పాల్గొంటూ యువనేత ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
ఎన్నికల ప్రణాళిక విడుదలతో కేటీఆర్ కొన్ని సన్నాహక సభలను రద్దు చేసుకోగా... వెంటనే కేసీఆర్ రంగంలోకి దిగారు. తొలిదశలో భాగంగా కరీంనగర్, నిజామాబాద్ సభల్లో పాల్గొన్నారు. ఆ తరువాత అభ్యర్థుల ఖరారు, నామిషన్ల ప్రక్రియతో కొంత విరామం ఇచ్చారు. తాజాగా మిర్యాలగూడ సభతో శుక్రవారం మలిదశ ప్రచారాన్ని పారంభించారు. అనంతరం జరిగిన ఎల్బీ స్టేడియం సభకు సమయాభావం కారణంగా కేసీఆర్ హాజరు కాలేదు. ఆదివారం నుంచి ఏప్రిల్ 4వరకు 9 సభల్లో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 27నుంచి కేటీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేసి... రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నేడు మహబూబాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
ఇవీ చూడండి:రాజకీయాల్లో గుణాత్మకమార్పు తెస్తా... ఆశీర్వదించండి!