లోక్సభ ఎన్నికల్లో బలం నిరూపించుకునేందుకు తెరాస ఉవ్విళ్లూరుతోంది. సారు, కారు, పదహారు... దిల్లీలో సర్కారు అంటూ శ్రేణులను ఉత్సాహపరుస్తోంది. ఓ వైపు ఆత్మవిశ్వాసం, మరో వైపు పక్కా ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నిఒకే వేదికపైకి వస్తే దాదాపు 150 సీట్లు వస్తాయని గులాబీదళం ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తోంది.
అవసరమైతే జాతీయ పార్టీ..!
ఇద్దరితోనే ఎంపీలతో తెలంగాణ సాధించానని... పదహారు మందిని గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామంటున్నారు కేసీఆర్. . దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిచేందుకు అవసరమైతే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.