హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 ద్విచక్ర వాహనాలు, ఒక ఇన్నోవా కారు, 2లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అన్ని బుల్లెట్ బండ్లే...
పాతబస్తీలోని శాస్త్రీపురానికి చెందిన నలుగురు వ్యక్తులు నగర శివారు ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగిలించేవాళ్లు. గతంలో వాళ్లపై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా ద్విచక్రవాహనాలు చోరీ చేయడం మొదలు పెట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన శంషాబాద్ పోలీసులు నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
దొంగతనానికి అమెజాన్ గోదాం...
మరో కేసులో ఐదుగురు అసోం దొంగలను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంపల్లిలోని అమెజాన్ గోదాంలో ఉన్న ఖరీదైన 120 చరవాణులను నిందితులు దొంగిలించారు. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి ఇళ్లల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ.. చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి:ఇంటికి తాళమేస్తే అంతే