దేశం గర్వించేలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లిలో తన నివాసం వద్ద నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గ తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ క్షేత్రంలో గెలుపోటములు సహజమని, ప్రజాతీర్పును గౌరవించి అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. డివిజన్లలోని ప్రధాన సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో... తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, కొలన్ లక్ష్మి, ఉప్పల తరుణి, హేమలత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలన దేశం గర్వించేలా ఉంది: తలసాని - talasani-byte
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజాతీర్పును గౌరవించి, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలన దేశం గర్వించేలా ఉంది
ఇవీ చూడండి: ఉప రాష్ట్రపతి వెంకయ్యతో ప్రధాని మోదీ భేటీ