.
పూల్లో విషాదం
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఏ టు జెడ్ స్విమ్మింగ్ పూల్లో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి మృతి చెందాడు. ఈత నేర్చుకోవడానికి వచ్చి నీటిలో మునిగి మరణించాడు. పూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద ఏ టు జెడ్ స్విమ్మింగ్పూల్లో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి మృతి చెందాడు. ఈత నేర్చుకోవడానికి వచ్చి నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు.
యాజమాన్య నిర్లక్ష్యమే...
అప్పటివరకు తమ ముందు ఆడుకున్న ఖాజా ఇప్పుడు విగతజీవిలా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈతకొలనులో సరైన నిర్వహణ, కోచ్ లేనందువల్లే ఖాజా మరణించాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. పూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆందోళనకు దిగారు.
కుటుంబంలో విషాదం
మృతుని కుటుంబీకుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్విమ్మింగ్ పూల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.