తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రావతరణ వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్​ గార్డెన్​ - undefined

రాష్ట్ర అవతరణ వేడుకలకు పబ్లిక్ గార్డెన్ ముస్తాబవుతోంది. పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గత కొద్దిరోజులుగా ఉత్సవాలకు సంబంధించిన పనులను రోడ్లు, భవనాల శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా జూబ్లీహాల్ ఎదురుగా సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించనున్నారు.

అవతరణ వేడుకలకు సిద్ధమవుతున్న పబ్లిక్​ గార్డెన్​

By

Published : May 27, 2019, 3:57 AM IST

Updated : May 27, 2019, 7:12 AM IST

అవతరణ వేడుకలకు సిద్ధమవుతున్న పబ్లిక్​ గార్డెన్​

ఈ ఏడాది నుంచి ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకలను ఈసారి పబ్లిక్ గార్డెన్​లో నిర్వహిస్తోంది. 1846లో బాగ్ ఇ ఉమ్ (పీపుల్స్ పార్క్) పేరుతో ఏర్పాటు చేసిన ఈ పార్క్ నిజాం కాలం నుంచి నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలకు సంబంధించిన పనులను ముమ్మరం చేశారు. జూబ్లీహాల్ ఎదురుగా ఉన్న ముఖద్వారాన్ని ఆకుపచ్చతోరణంగా తీర్చిదిద్ది ప్రత్యేక మెరుగులు దిద్దుతున్నారు. వేదిక చుట్టు, ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలోని వివిధ నర్సరీల నుంచి మొక్కలను తీసుకొస్తున్నారు. జూబ్లీహాల్ ను ఆధునీకరించారు. ఇందులో తొలిసారిగా కవి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రోడ్ల భవనాల శాఖ, ఉద్యానవనశాఖ అధికారులు అవతరణ వేడుకలకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు. వీఐపీలు, వీవీఐపీలు, ముఖ్యనేతలకు ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేస్తున్నారు.

Last Updated : May 27, 2019, 7:12 AM IST

For All Latest Updates

TAGGED:

df

ABOUT THE AUTHOR

...view details