తెలంగాణ

telangana

ETV Bharat / state

తొలిరోజు... వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు - MUNCIPAL ACT

శాసనసభ సమావేశాలు తొలిరోజు వాడివేడిగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​ కొత్త పురపాలక చట్టం ముసాయిదా బిల్లును ఇవాళ సభలో ప్రవేశపెట్టారు. అలాగే గతంలో జారీ చేసిన 4 ఆర్డినెన్స్​ల స్థానంలో వచ్చిన బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు...తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం లేదని వాకౌట్​ చేశారు.

వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు

By

Published : Jul 18, 2019, 7:52 PM IST

Updated : Jul 19, 2019, 7:22 AM IST

రెండు రోజుల శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల కాలంలో చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీశ్​ రెడ్డికి సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సభ ప్రారంభం కాగానే పురపాలక శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​... నూతన మున్సిపల్​ చట్టం బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టారు. అలాగే 4 ఆర్డినెన్సుల స్థానంలో ప్రభుత్వం బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చింది. బోధనాస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును కూడా ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. అలాగే రుణ విమోచన కమిషన్ ఛైర్మన్ నియామక బిల్లుతోపాటు... పురపాలికల్లో వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్​ల స్థానంలో తీసుకువచ్చిన బిల్లులను కూడా సభ ఆమోదించింది.

వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు

సందేహాలకు సీఎం సమాధానం...

బిల్లులపై చర్చలో భాగంగా ఎంఐఎం, కాంగ్రెస్​, భాజపా సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు సీఎం సమాధానం చెప్పారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్ సభ్యుల​ తీరుపై సీఎం కేసీఆర్​ తనదైన శైలిలో ఘాటైన విమర్శలు గుప్పించారు.

పంచాయతీరాజ్​ సవరణ బిల్లును సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రవేశపెట్టారు. బిల్లులో భాగంగా 147/11, 176/9 ఈ రెండు సెక్షన్లలో చేసిన సవరణలకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు తెలపగా, కాంగ్రెస్​ పార్టీ మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేసింది. రేపు పురపాలక బిల్లుపై సమగ్ర చర్చ జరుగనుంది.

నల్ల కండువాలతో కాంగ్రెస్​ నిరసన

అసెంబ్లీ సమావేశాలకు హస్తం నేతలు నల్ల కండువాలతో హాజరై నిరసన తెలిపారు. 12 మంది కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలను తెరాస పార్టీలో కలుపుకోవడంపై ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం నిరసనలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చే బిల్లులకు మద్దతిస్తున్నా... ఇతర అంశాలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. స్పీకర్​ సభను రేపటికి వాయిదా వేశారు.

ఇవీ చూడండి: గవర్నర్​తో సీఎం కేసీఆర్​ భేటీ

Last Updated : Jul 19, 2019, 7:22 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details