తెలంగాణ

telangana

ETV Bharat / state

దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే నెంబర్​ వన్​ - secundrabad

దేశంలోనే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న జోన్​గా దక్షిణ మధ్య రైల్వే రికార్డు సొంతం చేసుకుంది. అంతే కాకుండా అధిక ఆదాయ వృద్ధి కూడా సాధించినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్​ లోక్​సభలో వెల్లడించారు.

దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే నెంబర్​ వన్​

By

Published : Jul 11, 2019, 5:23 AM IST

Updated : Jul 11, 2019, 6:47 AM IST

సికింద్రాబాద్​ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న జోన్​గా రికార్డు సృష్టించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 18 వేల 43కోట్ల ఆదాయాన్ని నమోదు చేసి నెంబర్​వన్​గా నిలిచింది. అంతే కాకుండా... 10.4శాతం వృద్ధితో ముందంజలో ఉంది. రెండో అత్యధిక ఆదాయం పొందుతున్న జోన్​గా వాల్తేర్​ డివిజన్​ ఉన్న ఈస్ట్​కోస్ట్​ జోన్​ నిలిచినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్​ లోక్​సభలో వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు.

దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే నెంబర్​ వన్​
Last Updated : Jul 11, 2019, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details