తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీ చక్రస్నానం ఆలస్యం... వైదిక సిబ్బందిపై చర్యలు - late

అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి నిర్ణీత సయమంలో శ్రీచక్ర స్నానాన్ని నిర్వహించకుండా అలసత్వం వహించిన వైదిక సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

స్వామివారి సేవలో

By

Published : May 19, 2019, 3:28 PM IST

శ్రీ చక్రస్నానం ఆలస్యం... వైదిక సిబ్బందిపై చర్యలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామికి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ చక్ర స్నానం కార్యక్రమం నిర్వహణలో అలసత్వం వహించిన వైదిక సిబ్బందిపై ఈవో సురేష్ బాబు చర్యలు తీసుకున్నారు. ఉత్సవం ఆలస్యం కావడానికి పరిచారకులు ముత్య చిన వెంకట రావు, యడవల్లి ప్రసాద్​లను బాధ్యులుగా పరిగణిస్తూ తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన అర్చకులు హర గోపాల్, గైర్హాజరు అయిన వెంకటేశ్వరరావులకు ఛార్జి మెమో జారీ చేశారు. ప్రధాన అర్చకులు కొండవీటి సత్యనారాయణను సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

పంపా సరోవరం చెంత నిన్న ఉదయం 8 గంటలకు 30 నిమిషాలకు శ్రీచక్ర స్నానం పూజ ప్రారంభం కావాల్సి ఉండగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను 8 గంటల 51 నిమిషాలకు తీసుకుని వచ్చారు. ఇంతలో 8 గంటల 43 నిమిషాలకు వర్జ్యం వచ్చినందున 10.20 గంటల వరకు కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details