అమెరికా నుంచి వచ్చిన జయరామ్ జనవరి 29న తన ఇంటికి వచ్చారని శిఖా చౌదరి అన్నారు. తన ఇంటి నుంచి వెళ్లిన మరుసటి రోజు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని అడిగారని తెలిపారు. అకస్మాత్తుగా అంత డబ్బు ఎందుకని అడిగితే ఒకరి దగ్గరి నుంచి తీసుకున్నానని.. ఇప్పుడు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పాడన్నారు. మరుసటి రోజే మావయ్య చనిపోయారని అమ్మ చెప్పాక, రోడ్డు ప్రమాదంలో చనిపోయారనుకున్నానని తెలిపారు.
నాకే పాపం తెలీదు:శిఖా
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో తన ప్రమేయం లేదని ఆయన మేనకోడలు శిఖా చౌదరి తెలిపారు. మావయ్య చనిపోయాడనే బాధలో ఉన్న తనను నిందించడంపై ఆవేదన చెందారు. ఈ సమయంలో ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సి రావడం బాధగా ఉందని, తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
జయరామ్ హత్యపై స్పందించిన శిఖా చౌదరి
అప్పు తీసుకుంది రాకేష్ రెడ్డి దగ్గరే అని మావయ్య చనిపోయాకే తెలిసిందన్నారు శిఖా చౌదరి. డబ్బు ఇవ్వకపోవడం వల్ల అతనే మావయ్యని చంపేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. జయరామ్ గురించి తెలిసిన వారెవ్వరూ ఆయన్ను చంపితే లాభమనుకోరని... ఆయనతో పనిచేస్తే లాభపడతారని శిఖా వెల్లడించారు.
Last Updated : Feb 8, 2019, 10:02 AM IST