తెలంగాణ

telangana

ETV Bharat / state

నెక్లెస్​రోడ్​లో 'వీ ఆర్​ వన్' పరుగు ప్రారంభం - హైదరాబాద్

షీ టీమ్​ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్​రోడ్​లో 10కె, 5కె, 2కె పరుగును గవర్నర్​ నరసింహన్​ ప్రారంభించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సినీ నటి పూజా హెగ్డే, నిహారిక కొణిదెల, నైనా జైశ్వాల్​ పాల్గొన్నారు.

షీ టీమ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగును ప్రారంభించిన గవర్నర్​ నరసింహన్​

By

Published : Mar 17, 2019, 9:40 AM IST

షీ టీమ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగును ప్రారంభించిన గవర్నర్​ నరసింహన్​
హైదరాబాద్​ నెక్లెస్​రోడ్​లో 'వీ ఆర్ వన్'​ పేరుతో షీ టీమ్​ ఆధ్వర్యంలో 10కె, 5కె, 2కె పరుగు నిర్వహించారు. దీనిని గవర్నర్​ నరసింహన్​ ప్రారంభించారు. స్త్రీ, పురుష భేదభావం ఉండకూడదనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్​లో మహిళల భద్రత కోసం చేపడుతున్న కార్యక్రమాలను అదనపు సీపీ షీకా గోయల్​ వివరించారు. సీఎస్​ ఎస్కే జోషి, యూఎస్​ కాన్సులేట్​ జనరల్ క్యాథరిన్​ హడ్డా, డీజీపీ మహేందర్​రెడ్డి, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ హాజరయ్యారు. పరుగులో సినీనటి పూజా హెగ్డే, నిహారిక కొణిదెల, క్రీడాకారిణి నైనా జైశ్వాల్ కూడా యువతతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details