తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక్కడ ఎప్పట్నుంచో వీరే పోటీ చేస్తున్నారు

తెలంగాణలో కొన్ని లోక్​సభ స్థానాల్లో దీర్ఘకాలికంగా ఒకే కుటుంబం, ఒకే వ్యక్తి పోటీలో ఉంటున్నారు.  గెలిచినా... ఓడినా... దశాబ్ధాలుగా అదే నియోజకవర్గాన్ని నమ్ముకున్నారు. ఈ ఎన్నికల్లోనూ బరిలో దిగిన అలాంటివారున్నారు.

సుదీర్ఘంగా ఒకే స్థానం నుంచి బరిలో ఉన్నవారు

By

Published : Mar 26, 2019, 9:11 PM IST

సుదీర్ఘంగా ఒకే స్థానం నుంచి బరిలో ఉన్నవారు

హైదరాబాద్​లో ఓవైసీలు...

హైదరాబాద్ లోక్​సభ నుంచి మూడున్నర దశాబ్ధాలుగా ఓవైసీ కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తోంది. 1984లో మొదటిసారి గెలిచిన సలావుద్దీన్ ఓవైసీ 1999 వరకు వరుసగా 6సార్లు విజయం సాధించారు. 2004 నుంచి ఆయన తనయుడు అసదుద్దీన్ ఓవైసీ హ్యాట్రిక్ సాధించి నాలుగోసారి బరిలో ఉన్నారు.

నాగర్​కర్నూల్​లో 20ఏళ్ల తరువాత మల్లు రవి మరోసారి బరిలో దిగారు. 1991 నుంచి 1999 వరకు నాలుగు సార్లు పోటీ చేసి 2సార్లు గెలిచారు. ఖమ్మం నుంచి రేణుక చౌదరి నాలుగోసారి పోటీకి సిద్ధమయ్యారు. 1999 నుంచి 2009వరకు 3సార్లు పోటీ చేసి 2సార్లు విజయం సాధించారు. 2009లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి కోమటిరెడ్డి సోదరులు బరిలో ఉంటున్నారు. 2009, 2014లో రాజగోపాల్ రెడ్డి పోటీ చేయగా... ఈసారి వెంకట్​రెడ్డి బరిలో నిలిచారు.

పెద్దపల్లిలో కాకా...

పెద్దపల్లి నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది వెంకటస్వామి అలియాస్ కాకా. 1989 తరువాత కాకా కుటుంబం నుంచి అభ్యర్థి లేకుండా తొలిసారి లోక్​సభ ఎన్నిక జరుగుతోంది. 6సార్లు ఇక్కడి నుంచి పోటీ చేసిన కాకా 4సార్లు విజయం సాధించారు. 2009లో ఆయన తనయుడు వివేకానంద రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారి గెలుపుబావుటా ఎగురవేశారు. 2014లో మాత్రం తెరాస అభ్యర్ధి బాల్క సుమన్​ చేతిలో ఓడిపోయారు. తర్వాత గులాబీ తీర్ధం పుచ్చుకున్నా టికెట్​ దక్కించుకోలేకపోయారు.

ఇవీ చూడండి:ఎన్నికల్లో దండయాత్ర

ABOUT THE AUTHOR

...view details