తెలంగాణ

telangana

ETV Bharat / state

​బస్సు కిందపడి రెండేళ్ల బాలుడు మృతి - ​బస్సు కిందపడి రెండేళ్ల బాలుడు మృతి

వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఇంజాపూర్​లో అభం శుభం తెలియని  బాలుడి పైనుంచి ప్రైవేట్​ పాఠశాల బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ బాలుడు మరణించాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

​బస్సు కిందపడి రెండేళ్ల బాలుడు మృతి

By

Published : Mar 14, 2019, 12:39 PM IST

Updated : Mar 14, 2019, 1:08 PM IST

​బస్సు కిందపడి రెండేళ్ల బాలుడు మృతి
వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఇంజాపూర్​లో ఘోరం జరిగింది. సాయినాథ్ కాలనీలో రెండేళ్ల రోహన్​రెడ్డి మీద నుంచి ఓ ప్రైవేట్​ పాఠశాల బస్సు దూసుకెళ్లింది. కాలనీలో విద్యార్థులను తీసుకెళ్లడానికి వచ్చి అక్కడే ఆడుకుంటున్న రోహన్​ను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు.

పాఠశాల ఎదుట ఆందోళన...

తమకున్న ఒక్క కొడుకు మృత్యువాత పడినందున తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బస్సు డ్రైవర్​ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తెలుసుకున్న స్థానికులు పాఠశాల ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండిఃహస్తం తర్వాతే కారు!

Last Updated : Mar 14, 2019, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details