హైదరాబాదులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ఓ ఆర్టీసీ బస్సును రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. బండ్లగూడ డిపోకు చెందిన బస్సు గత కొన్ని నెలలుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటివరకు సదురు బస్సుపై 16 కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్టీసీ బస్సుపై అనుమానంతో నెంబర్ తనిఖీ చేశారు. 16 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి బస్సును స్వాధీనం చేసుకున్నారు. యజమాని వచ్చి రూ.10,220 చెల్లించిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు బస్సును విడిచిపెట్టారు. నిబంధనలు పాటించక పోతే ప్రభుత్వ, ప్రైవేట్ వాహన యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఆర్టీసీ బస్సుపై 16 చలానాలు
ఆ ఆర్టీసీ బస్సు యజమాని తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వస్తున్నాడు. చలాన్లు వస్తే ప్రభుత్వమే చూసుకుంటుందనుకున్నాడు. ఉప్పల్ చౌరస్తాలో పోలీసులు తనిఖీ చేయగా సదరు వాహనంపై 16 పెండింగ్ కేసులు నమోదై ఉన్నాయి. ఇంకేముంది బస్సు స్వాధీనం చేసుకున్నారు. యజమాని వచ్చి రూ.పదివేలు చెల్లిస్తే గాని వదల్లేదు.
ఆర్టీసీ బస్సుసు పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు