వారసిగూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నామాలగుండు కన్యకా పరమేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ వేడకలకు ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రావడం ఇదే తొలిసారని, ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. అమ్మవారి దీవెనలు ఆశీస్సులు అందరిపై ఉండాలని రోశయ్య కోరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంఢీ హోమం, అభిషేకము, సామూహిక కుంకుమార్చన, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సికింద్రాబాద్ వారసిగూడలో రోశయ్య - roshaiah
సికింద్రాబాద్ నామాలగుండు కన్యకా పరమేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారసిగూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు మాజీ సీఎం రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి నుంచి 15వ తేదీ వరకూ ఉత్సవాలు కొనసాగునున్నాయి.
పూజ చేస్తున్న రోశయ్య