వందల కోట్లతో వందేళ్ల కోసం నిర్మించిన భవనాలను కూలగొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలను నిలువరిస్తామని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ భవనాల్లో ఉంటే తన కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరని వాస్తు పండితులు చెప్పటం వల్లనే భవనాలు కూల్చాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు. సీఎస్‌ను కలిసి విజ్ఞప్తి చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.
'వాస్తు పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృథా' - revanth on secreteriate change
కొత్త సచివాలయం నిర్మాణం పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి వృథా చేయాలనుకుంటున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు.

'వాస్తు పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృథా'
Last Updated : Jun 15, 2019, 9:26 PM IST